Saradhaga oka Sayantram

తెలుగు మిత్రులందరికీ నమస్కారం! మీరు ఒక రచయిత కావచ్చు లేదా మీలో ఒక విమర్శకుడు అయి ఉండవచ్చు. సహజ హాస్యం మీ సొంతమైన లేక ముఖ్యంగా ఒక చక్కటి శ్రోత మీలో ఉన్నా- మనం అందరం అందుకోబోతున్న అవకాశం మరియు పంచుకో పోతున్న వేదిక “ఓర్లాండో తెలుగు మిత్రుల సాహిత్య చర్చ”.

తరతరాల నుంచి ఎందరో మహాకవులు, రచయితలు ఎన్నో సంవత్సరాలు శ్రమించి తప్పించి శోధించి మనకు అందించిన అమూల్యమైన సంపద “అద్భుతమైన సాహిత్యం”. ఆ సంపదని కనీసం చదవడం లేదా వినడం ద్వారా న్యాయం చేయటం మన బాధ్యత మరియు గౌరవం అని అందరూ ఏకీభవిస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

కథలో ఇమిడి వినూత్న కథాంశం, కవిత లోని పదాల గుబాలింపు, పద్యంతో ఊరించే రసమాధురి, చక్కిలిగింతల చక్కని హాస్యం, పాట లలో పరిమళించే సోయగాల సరిగమలు, జానపదాల జావళీలు  ఇలా ఒకటేమిటి ఎన్నో ఎన్నెన్నో తెలుగువారి సొంతం.

యాంత్రికమైన ఈ ఉరుకు పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ ముఖ్యంగా కోరుకునేది చక్కటి ఉపశమనం. ముత్యాలముగ్గు చిత్రంలో ముళ్ళపూడి వారు చెప్పినట్లు “మనిషి అన్నాక కళాపోషణ ఉండాలి. లేకపోతే…..”.

మీకు నచ్చిన కథ, కవిత, పాట లేదా పద్యం లేదా మీరు నచ్చిన కవి లేక రచయిత, ఏదైనా సరే అందరితో సరదాగా పంచుకోండి. రండి మనం అందరం కలిసి హాయిగా నెలలో ఒక సాయంత్రం ఈ చక్కటి మాధుర్యాన్ని ఆస్వాదిద్దాం. ఒక గంట పాటు తెలుగు సాహిత్యాన్ని సందర్శించి, ఆ సాహిత్య సంద్రాన్ని చిలికి మనకు అందించిన మహనీయులను స్మరించడం ద్వారా వారికి మన కృతజ్ఞతలు తెలుపుదాం.

వచ్చే ఉగాది రోజు మన ప్రారంభ సమావేశం జరిగితే బాగుంటుంది కదా! ఈ సమావేశానికి అందరూ ఆహ్వానితులే.

మీ ప్రతి ఒక్క సలహా సూచన ఎంతో ముఖ్యం వాటిని స్వీకరించడానికి  మాకు ఎటువంటి అభ్యంతరం లేదు.  దయచేసి ఇ ఈ సమాచారాన్ని మీ మిత్రులందరికీ తెలియజేయండి. మేము చేసే ఈ చిన్న ప్రయత్నానికి మీ వంతు సహకారాన్ని అందించి ప్రోత్సహించండి. మీరు వ్యక్తిగతంగా మాట్లాడాలంటే ఈ క్రింది వారిని సంప్రదించవచ్చు.

 

శాయి ప్రభాకర్ యఱ్ఱాప్రగడ (407) 590-0890

మధు చెరుకూరి (407) 415-2055 

డా. వెంకట శ్రీనివాస్ పులి (407) 467-2677

సత్యహనుమాన్ ధూళిపాళ (918) 519-3096

ప్రసాద్ కొంపెల్ల (407) 968-5385 

Event Performance Registration Form

Name
Select Your Event
Please enter a number from 1 to 25.

We hope to see you as TAGO Member and take advantages of the membership such as, Member only discounts, Members only event pricing

TAGO Karthika Vana Bhojanalu and Sports day

కార్తీక వనభోజనాలు – మా అద్భుతమైన వాలంటీరు మరియు స్పాన్సర్లనుండి రుచికరమైన ఇంట్లో వండిన ఆహారంతో, కార్తిక వనభోజనం వేడుకలో మాతో చేరండి. అన్ని వయసుల పెద్దలు

Read More »

Bathukamma

బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళల యొక్క పోషకుడి దేవత అయిన మహా గౌరీ (లైఫ్ గివెర్) దేవత అలైవ్కు వచ్చి, ఆరాధన కొరకు, తెలుగులో, హిందూ స్త్రీలు

Read More »
 • Our Sponsors
 • 0
   0
   Your Cart
   Your cart is emptyReturn to Shop
   Sign up to our email newsletter for all the latest news, opportunities and upcoming events.